Arogya Chitkalu
ప్రతి రోజు ఆరోగ్య చిట్కాలు | హోమ్ రెమిడీస్ | హెల్త్ టిప్స్
మీ ఆరోగ్యమే మా లక్ష్యం 💚
👉 Arogya Chitkalu
05/08/2026
'బ్లడీ రోమియో' తర్వాతే 'OG-2'!
డైరెక్టర్ సుజీత్‌తో నాని చేయబోయే 'బ్లడీ రోమియో' మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సినీ వర్గాలు తెలిపాయి. ముందు HYDలో, తర్వాత లండన్‌లో షూట్ చేస్తారని పేర్కొన్నాయి. 2027 సమ్మర్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ 'OG-2' ఉంటుందని సమాచారం. నాని మూవీ కంటే ముందు సుజీత్ 'OG-2' చేస్తారని ఇటీవల టాక్ నడిచింది. అయితే పవన్ ఆరోగ్యం దృష్ట్యా ఆ మూవీ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
05/08/2026
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక మీదట ఒక లెక్క.. తమిళనాడు సీఎం విజయ్ తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. తనపై తప్పుడు కామెంట్లు చేసే వారిని ఉపేక్షించేది లేదని ఉదయనిధి అరెస్టుతో వార్నింగ్ ఇచ్చారు. సీఎంను టార్గెట్ చేసేందుకు తోటి హీరోయిన్ త్రిషను లాగడమే వివాదానికి దారి తీసింది. ఇప్పటికే డీఎంకే నేతతో పాటు పలువురు ఇదే విషయంలో అరెస్టయ్యారు. మరి సీఎం దూకుడుతో ప్రతిపక్షాలు జాగ్రత్త పడతాయేమో చూడాలి.
04/08/2026
ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? CJP ఫౌండర్ సమాధానమిదే
తన ఫారిన్ ఎడ్యుకేషన్‌కు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే సమాధానమిచ్చారు. బోస్టన్ వర్సిటీ(US) నుంచి స్కాలర్షిప్ వచ్చిందని, మిగతా ఖర్చులకు ఎడ్యు కేషన్ లోన్ తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిని తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. రూ.35.77లక్షల స్కాలర్షిప్ డాక్యుమెంట్ చూపించారు. కాగా CJP కార్యక్రమాల కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తామని ఇటీవల అభిజీత్ పేర్కొన్నారు.
04/08/2026
తనకు సవాలుతో కూడిన పాత్రలు చేయడం ఇష్టమని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. అందుకే 'రామాయణ'లో శూర్పణఖ పాత్రను పోషించినట్లు తెలిపారు. 'శూర్పణఖ అనగానే అందరూ ఒకే ఘట్టం (లక్ష్మణుడు ముక్కు కోసిన ఘటన) గుర్తుంచుకుంటారు. కానీ ఆమె జీవితంలో ఎంతో భావోద్వేగం, సంక్లిష్టత ఉంది. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి' అని పేర్కొన్నారు. ఓ అభిమాని రాసిన లేఖపై ఆమె ఇలా స్పందించారు.
అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే?
26/07/2026
హీరో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
26/07/2026
మీరాభాయ్ చానూ.. హ్యాట్రిక్ క్వీన్
ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ క్వీన్ మీరాభాయ్ చానూ సరికొత్త చరిత్రను లిఖించారు. వరుసగా 3 కామన్వెల్త్ గేమ్స్ (2018, 2022, 2026)లో పసిడి పతకాలను ముద్దాడిన భారతీయురాలిగా నిలిచారు. మణిపురు చెందిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించారు. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్గా ఘనతకెక్కారు. చానూను 2018లో ఖేల్ రత్నం, 2019లో పద్మశ్రీ అవార్డులు వరించాయి.
26/07/2026
ఆధార్ రూపకర్తకు మోదీ కీలక బాధ్యతలు.. ఎవరీ నందన్ నీలేకని?
కర్ణాటకకు చెందిన నందన్ నీలేకని IIT బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. తొలుత ఓ IT కంపెనీలో పనిచేసి, 1981లో మూర్తి, మరో ఐదుగురితో కలిసి 'Infosys'ను స్థాపించారు. ఆ సంస్థకు MD, COO, CEOగా, 2009లో UIDAI తొలి ఛైర్మన్ గా పనిచేశారు. ఆధార్ వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2014లో బెంగళూరు సౌత్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు. 2017 Infosysకు తిరిగొచ్చి ఛైర్మన్ అయ్యారు.
26/07/2026
కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ఓపెన్.. ట్రైన్ల టైమింగ్స్ ఇవే
TG: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే 77654 రైలు(బుధవారం మినహా) మ.2.38 గంటలకు కొమురవెళ్లిలో ఆగుతుంది. 77656 రైలు (గురువారం మినహా) ఉ.6.45 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లే 77653 ట్రైన్(బుధవారం మినహా) మ. 12.44 గంటలకు, 77655 రైలు రా.8.04 గంటలకు కొమురవెళ్లిలో ఆగుతుంది.
13/07/2026
ఆటో పే ఆన్ ఉంటే డబ్బులు కట్.. చెక్ చేసుకోండి!
UPIలో ఆటో పే ఆన్ చేసి చాలా మంది మర్చిపోతారు. కొందరేమో తెలియక ఆన్ చేసి ప్రతినెలా డబ్బులు కట్ అయ్యాక బాధపడతారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, BHIM యాప్లలో ఆటో పేను ఆపడానికి లేదా మొత్తానికి రిమూవ్ చేసేందుకు ఆప్షన్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లోకి వెళ్లి పేమెంట్స్ సెట్టింగ్స్ లేదా మేనేజ్ పేమెంట్స్ లోకి వెళ్లాలి. అందులో ఆటో పే సెలక్ట్ చేసుకొని Pause లేదా Remove చేయవచ్చు.
Category
Website
Address
Hyderabad